: అమ్మ అస్థిపంజరంతో ఆరునెలలుగా జీవిస్తోన్న టీచర్!
ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ తన తల్లి అస్థిపంజరంతోనే ఆరు నెలలుగా సహవాసం చేస్తోంది. తాజాగా ఆ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ అస్థిపంజరాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు చూస్తే.. ఆ రాష్ట్రంలోని అర్జున్ నగర్‌లో బీనా(45) అనే మహిళ తన తల్లి శవంతో ఆరునెలలుగా ఇంట్లో ఉంటోంది. బీనా ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఆమె తల్లి ప్రభుత్వ రిటైర్డు నర్సు. బీనా తల్లికి పింఛను వస్తోంది. అయితే, బీనా మానసిక పరిస్థితి బాగాలేదని స్థానికులు చెబుతున్నారు. బీనా తల్లి ఎలా చనిపోయిందనే విషయంపై ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.