: డబుల్స్ కి ఎలా సపోర్ట్ చేయాలో అలా చేయలేదు: పుల్లెల గోపీచంద్ పై గుత్తా జ్వాల విమర్శలు

డబుల్స్ కి ఎలా సపోర్ట్ చేయాలో ఆ విధంగా బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ చేయలేదని క్రీడాకారిణి గుత్తా జ్వాల విమర్శలు చేశారు. ఈ రోజు ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... పుల్లెల గోపీచంద్ అకాడమీకి వెళ్లి తాను సలహాలు తీసుకుంటున్నానని వస్తోన్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. తాను ఓ విషయంలో పుల్లెల గోపీచంద్ తో విభేదిస్తానని అన్నారు. సింగిల్స్‌ని పుల్లెల గోపీచంద్ ఎలా సపోర్ట్ చేస్తారో.. డబుల్స్‌ని కూడా అలాగే సపోర్ట్ చేయాలని ఆమె అన్నారు. కామన్ వెల్త్ గేమ్, ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో తాము డబుల్స్ లోనే గెలిచామని అన్నారు.