: దయచేసి మా దేశానికి అధ్యక్షుడిగా రా.. ఒబామా!: ఫ్రాన్స్ లో వినూత్న ప్రచారం


ఫ్రాన్స్ ఓట‌ర్లు అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామాను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు. త‌మ దేశానికి అధ్యక్షునిగా ప‌నిచేయాలని కోరుతున్నారు. కేవ‌లం అలా కోరుకోవ‌డ‌మే కాదు.. ఒబామా 17 అనే ప్ర‌చారం జోరుగా నిర్వ‌హిస్తున్నారు. త‌మ దేశానికి ఒబామాను అధ్యక్షుడిగా అంగీక‌రించేవారు తాము సూచించిన‌ వెబ్‌సైట్‌కు వెళ్లి పిటిష‌న్‌పై సంత‌కం చేయాల‌ని అంటున్నారు. వచ్చేనెల‌ 15 లోపు ప‌ది ల‌క్ష‌ల సంత‌కాలు సేక‌రించడ‌మే ధ్యేయంగా ప్ర‌చారం చేస్తున్నారు. ఇప్ప‌టికే 27 వేల మందికిపైగా ఈ ప్ర‌చారానికి మ‌ద్ద‌తుగా సంత‌కాలు చేశారు.

త‌మ దేశానికి అధ్య‌క్షుడిగా ఉండ‌డానికి ప్ర‌ప‌ంచంలో ఒబామాను మించిన వ్య‌క్తి ఎవ‌రుంటారని ఆ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. అయితే, ఒబామా మాత్రం ఫ్రెంచ్ పౌరుడు కాదు. దీంతో తాము సూచిస్తున్న‌ట్లు ఒబామా త‌మ దేశ అధ్య‌క్ష‌ ప‌ద‌విని స్వీక‌రించ‌డానికి ఆస‌క్తిగా ఉన్నారని కూడా తాము భావించ‌డం లేదని కూడా అదే వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. చూడ‌డానికి ఈ ప్ర‌చారం మ‌న‌కి త‌మాషాగా అనిపించ‌వచ్చు. కానీ , ఫ్రెంచ్ రాజకీయాల‌లో కాస్త విభిన్నంగా ఏం చేయొచ్చో ఈ ప్రచారం ద్వారా ఫ్రాన్స్ ప్ర‌జ‌లు ఆలోచిస్తారు. అందులో భాగంగానే ఫ్రాన్స్ అధ్య‌క్షుడిగా ఓ విదేశీయుడిని ఎన్నుకొని ప్ర‌పంచ ప్ర‌జాస్వామ్యానికి ఓ పాఠం నేర్పుదామ‌ని ఆ వెబ్‌సైట్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 23న ఫ్రాన్స్ అధ్యక్ష ప‌ద‌వికి తొలి రౌండ్ ఎన్నిక‌లు జ‌రుగుతాయి. ప్రాన్స్‌లోని ఫ్రంట్ నేష‌న‌ల్ పార్టీకి చెందిన మ‌రైన్ లె పెన్ తొలి రౌండ్‌లో విజ‌యం సాధించ‌వ‌చ్చ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.



  • Loading...

More Telugu News