: ట్రంప్ ఎఫెక్ట్: ఆస్కార్‌ అవార్డుకు నామినేట్‌ అయిన సినిమాటోగ్రాఫర్‌ను అడ్డుకున్న అధికారులు


తమ దేశంలోకి ఏడు ముస్లిం దేశాల ప్ర‌జ‌లు రాకుండా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంత‌కంతో ఆ దేశంలోకి వ‌స్తోన్న విదేశీయుల‌కు ఇబ్బందులు త‌ప్ప‌డం లేవు. ట్రంప్ ఎఫెక్ట్ ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ఆస్కార్‌ అవార్డుకు నామినేట్‌ అయిన ‘ద వైట్‌ హెల్మెట్స్‌’ సినిమాటోగ్రాఫర్ ఖలేద్‌ ఖతీబ్ (21)ను కూడా తాకింది. ఆయ‌న‌ను విమానాశ్ర‌యంలోనే యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అడ్డుకున్నారు. ఆయ‌న సిరియా దేశానికి చెందిన సినిమాటోగ్రాఫ‌ర్ కావ‌డ‌మే అందుకు కార‌ణం. ఆస్కార్‌ వేడుకలకు ఒకరోజు ముందే యూఎస్‌కు చేరుకోవాల‌నుకున్న ఖతీబ్ ను.. భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న కార‌ణంతోనే అడ్డుకున్నామ‌ని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News