: నియంత్రణ రేఖ వద్ద మరో సైనికుడి ఆత్మహత్య


గతేడాది అక్టోబర్‌లో బీఎస్‌ఎఫ్‌కు చెందిన ఓ జవాన్‌ జైసల్మార్‌ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న ఘటనను మరవక ముందే ఈ రోజు మ‌రో బీఎస్ఎఫ్ జ‌వాను బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. జమ్ము కశ్మీర్‌లోని పూంఛ్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖలోని ఖారా వన్‌ పోస్ట్‌ వద్ద  జ‌వాను మృతదేహం ప‌డి ఉండ‌డాన్ని గ‌మ‌నించిన పోలీసులు అతడిని ఆసుప‌త్రికి తరలించారు. అయితే, ఆ జ‌వాను అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. మృతుడు యూపీకి చెందిన బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ కుమార్‌గా పోలీసులు గుర్తించారు.

  • Loading...

More Telugu News