: ‘మన్ కీ బాత్’లో తెలంగాణపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా రేడియోలో ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులపై ప్రశంసల జల్లు కురిపించారు. రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. స్వచ్ఛభారత్‌లో ప్రతిఒక్కరూ పాల్గొనాలని మోదీ కోరారు. తెలంగాణ రాష్ట్రం మరుగుదొడ్ల నిర్మాణంలో ముందుందని తెలిపారు. రాష్ట్రంలోని గంగదేవిపల్లిలో నూటికి నూరుశాతం పరిశుభ్రత, పచ్చదనం పాటిస్తున్నారని ఆయన అభినందించారు. ఆ గ్రామస్తుల కృషిని కొనియాడారు.