: మార్చి, ఏప్రిల్‌ నెలల్లో మూడు ప్రయోగాలు చేసి మరో రికార్డును సృష్టించనున్న ఇస్రో


ఇటీవ‌లే ఒకే రాకెట్‌ ద్వారా 104 ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించి విజ‌య‌వంత‌మైన ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు మ‌రో రికార్డును సృష్టించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో మూడు ప్రయోగాలను చేయడానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. నెల్లూరు జిల్లా శ్రీ‌హ‌రికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి వ‌చ్చేనెల 31న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్ – 09, అనంత‌రం ఏప్రిల్‌లో జీఎస్‌ఎల్‌వీ మార్క్‌– 3, అదే నెలలో పీఎస్‌ఎల్‌వీ సీ38 ప్రయోగాలను నిర్వహించాల‌ని భావిస్తున్నారు. ఏకకాలంలో మూడు రాకెట్‌ల అనుసంధానం పనులు పూర్తి చేస్తున్నారు. జీఎస్‌ఎల్‌వీ ఎఫ్ – 09 రాకెట్‌ ద్వారా 2 టన్నుల బరువైన జీశాట్‌–9, జీఎస్‌ఎల్‌వీ మార్క్‌– 3 రాకెట్‌ ద్వారా నాలుగు టన్నుల బరువు కలిగిన జీశాట్‌ –19 అనే సమాచార ఉపగ్రహాలను రోదసీలోకి పంపించ‌నున్నారు.

  • Loading...

More Telugu News