: పాయింట్‌బ్లాంక్‌లో తుపాకి పెట్టి వలసదారులను చంపండి: అమెరికా టీచర్ ట్వీట్ దుమారం


అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ప్ప‌టినుంచి ఆ దేశంలో ఉంటున్న‌ వలసదారుల్లో తీవ్ర ఆందోళ‌న చెల‌రేగుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వ‌ల‌స‌దారుల‌పై అమెరికాలో ఓ మహిళా టీచర్ తీవ్రమైన వ్యాఖ్య‌లు చేయ‌డం దుమారం రేపింది. వ‌ల‌స‌దారుల‌ను తిరిగి వెనక్కి పంపించడానికి బదులు వారిని చంపేయాలంటూ సామాజిక మాధ్య‌మాల్లో బోన్నీ వర్నె అనే మహిళా ఉపాధ్యాయురాలు ట్వీట్ చేసింది. అంతేగాక‌, వారిని పాయింట్‌బ్లాంక్‌లో తుపాకి పెట్టి చంపాల‌ని పేర్కొంటూ ప‌లు తీవ్రమైన వ్యాఖ్య‌లు చేసింది.
 
అమెరికాలాంటి స్వేచ్ఛా దేశంలో వలసదారులు, శరణార్థులు కంపుకొట్టేలా పేరుకుపోయార‌ని స‌ద‌రు ఉపాధ్యాయిని త‌న ట్వీట్లో పేర్కొంది. ఆమె చేసిన‌ పోస్ట్‌ ఇంటర్నెట్‌లో వారం రోజులపాటు వైర‌ల్‌గా మారింది. వలసదారులను కించపరిచేలా ఉన్న ఆమె ట్వీటును చూసిన ఆమె ప‌నిచేస్తోన్న‌ పాఠశాల యాజమాన్యం క్రమశిక్షణా చర్యలు తీసుకొంది.

  • Loading...

More Telugu News