: గంటాను మంత్రి పదవి నుంచి బర్త్‌రఫ్ చేయాలి!: రోజా డిమాండ్


ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఈ రోజు విశాఖ‌ప‌ట్నంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ విశాఖ నగరంలో మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు భూముల అక్రమాలకు పాల్పడ్డార‌ని ఆమె ఆరోపించారు. ఆయ‌న‌ను మంత్రి పదవి నుంచి బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. గంటాతో పాటు మంత్రి నారాయణ విశాఖను దోచుకుంటున్నారని ఆమె ఆరోపణ‌లు గుప్పించారు. త‌మ పార్టీ అధినేత జగన్మోహ‌న్ రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టించారని మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి వ్యాఖ్యల ద్వారా అంద‌రికీ తెలిసింద‌ని ఆమె వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు నాయుడు ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకే ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ అంశాలను కేంద్ర ప్ర‌భుత్వానికి తాకట్టు పెట్టారని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News