: లక్కీ యువతి... ఆలస్యంగా వచ్చినా గ్రూప్-2 రాసేందుకు అవకాశమిచ్చిన విశాఖ జాయింట్ సీపీ


నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్-2 పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం, పరీక్షా సమయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి వుండగా, ఉదయం 9:45 గంటలను కటాఫ్ గా ప్రకటించిన అధికారులు, నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని విస్తృతంగా ప్రచారం చేశారు. వివిధ కారణాలతో ఎన్నో కేంద్రాలకు ఆలస్యంగా చేరుకున్న అభ్యర్థులు లోనికి వెళ్లలేక కన్నీరు మున్నీరయ్యారు.

విశాఖలో మాత్రం ఓ యువతిని అదృష్టం వెన్నాడింది. పరీక్షా కేంద్రం వద్దకు ఆమె చేరుకునే సరికి గేటుకు తాళం పడిపోయింది. లోనికి వెళ్లలేక, ఆమె రోదిస్తుండగా, అక్కడే బందోబస్తులో ఉన్న నగర జాయింట్ కమిషనర్ సత్తార్ ఖాన్ స్పందించి, ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఆమెను లోనికి అనుమతించాలన్న సత్తార్ విజ్ఞప్తికి అధికారులు సానుకూలంగా స్పందించడంతో, సదరు యువతి ఆనందంగా లోనికి వెళ్లింది.

  • Loading...

More Telugu News