: ఆ పోస్టర్లు చూసిన నా భార్యకు గుండెపోటు వచ్చింది: తమిళ కమెడియన్ కరుణాస్


తనను కించపరచాలన్న ఆలోచనతో, ఉద్దేశపూర్వకంగా తయారు చేసిన పోస్టర్లను చూసిన తరువాత తన భార్యకు గుండెపోటు వచ్చిందని, ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తమిళనాడు ఎమ్మెల్యే, హాస్య నటుడు కరుణాస్ ఆరోపించారు. తాను శశికళకు మద్దతు పలకడంపై నిరసన వ్యక్తం చేస్తున్న కొందరు, కరుణాస్ ఫోటోకు ఆయన భార్య గ్రేస్ కన్నీటి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టు పోస్టర్లు అతికించారు. భావ స్వాతంత్ర్యం పేరిట కొందరు తనను కించ పరిచేలా ప్రవర్తించారని, వారిపై చర్యలు తీసుకోవాలని కరుణాస్ చెన్నై కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. కాగా, శుక్రవారం తన సొంత నియోజకవర్గం తిరువాడైకు వెళ్లిన కరుణాస్ కు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News