: అమరనాథుని దర్శనానికి మార్చ్ 1 నుంచి రిజిస్ట్రేషన్లు


హిమాలయాల్లో కొలువై, ఏడాదిలో కొద్ది కాలం మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే పవిత్ర అమరనాథుడి దర్శనం పొందగోరేవారు మార్చి 1 నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని ఆలయ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ త్రిపాఠి వెల్లడించారు. జూన్ 29 నుంచి ఆగస్టు 7 వరకూ సాగే యాత్రలో భాగంగా బల్తాల్, చందన్ వారి మార్గాల ద్వారా యాత్రికులు పవిత్ర మంచు లింగాన్ని దర్శించుకునేందుకు వెళ్లవచ్చని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 433 పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, జమ్మూ కశ్మీర్‌ బ్యాంక్, ఎస్‌ బ్యాంకు శాఖల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పాటించాల్సిన విధి విధానాలను ఆలయ బోర్డు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచామని అన్నారు.

  • Loading...

More Telugu News