: తన ప్రేమ వ్యవహారాన్ని ఖండిస్తున్న శ్రుతి హాసన్... అడ్డంగా దొరికిపోయిందిలా!


బ్రిటిష్‌ కు చెందిన ఇంగ్లీష్ థియేటర్ ఆర్టిస్టు మైఖేల్ కోర్సెల్ తో తన ప్రేమ వ్యవహారాన్ని అందాల భామ శ్రుతి హాసన్ ఎంతగా దాచాలని చూస్తున్నా, ఏదో ఓ రకంగా బయటకు వస్తూనే ఉంది. తాజాగా, మైఖేల్ ట్విట్టర్ లో శ్రుతితో కలసి దిగిన ఓ చిత్రం హల్ చల్ చేస్తోంది. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా, శ్రుతి కోసమే ప్రత్యేకించి వచ్చిన మైఖేల్, ముంబైలో ఆమెతో కలసి గడిపినట్టు తెలుస్తోంది. ‘ఇండియాలో ఓ మంచి అమ్మాయితో చక్కటి సమయాన్ని గడిపాను. అందమైన స్నేహితుల బృందం ఇక్కడుంది. ఇండియా నాకు రెండో ఇల్లు’ అని వ్యాఖ్యానిస్తూ, మైఖేల్ ఈ ఫోటోను పోస్టు చేశాడు. కాగా, బ్రిటిష్‌ ఆల్టర్నేటివ్‌ రాక్‌ బ్యాండ్‌ లో ప్రదర్శన నిమిత్తం వెళ్లిన శ్రుతికి ఓ స్నేహితుడి ద్వారా మైఖేల్ పరిచయం కాగా, వీరిద్దరూ ప్రస్తుతం డేటింగ్‌ లో ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మైఖేల్ పోస్టు చేసిన ఫోటోను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News