: 13 ఏళ్ల జైలు శిక్షను అనుభవించేందుకు సిద్ధమైన ఫుట్ బాల్ దిగ్గజం పీలే కుమారుడు


మనీ లాండరింగ్, మాదక ద్రవ్యాల కేసులో బ్రెజిల్ కోర్టు తీర్పు ప్రకారం, 13 ఏళ్ల జైలుశిక్షను అనుభవించేందుకు ఫుట్ బాల్ దిగ్గజం పీలే కుమారుడు ఎడ్సన్ ఎడ్హినో చోల్బీ లొంగిపోయారు. తన తండ్రి ఫుట్ బాల్ క్లబ్ సాంటోస్ కు ఎన్నో మ్యాచ్ లు ఆడిన ఎడ్సన్, ఇప్పటికే ఈ కేసులో అపీలు మీద అపీలు చేస్తూ, విచారణను చాలా కాలంగా సాగదీస్తూ వచ్చిన సంగతి తెలిసింది. ఇక 2014లో కోర్టు ఇచ్చిన 33 ఏళ్ల జైలు శిక్షను 12 సంవత్సరాల 10 నెలలకు కుదిస్తూ, తాజా తీర్పు వెలువడటంతో, ప్రస్తుతం 46 సంవత్సరాల వయసున్న ఎడ్సన్, తనకు 59 ఏళ్లు వచ్చే వరకూ జైల్లో గడపక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. డ్రగ్ ట్రాఫికింగ్ ముఠాతో సంబంధాలున్నాయని ఎడ్సన్ పై 2005లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆరు నెలల శిక్ష అనంతరం ఆయన పెరోల్ పై విడుదలయ్యాడు.

  • Loading...

More Telugu News