: మెల్ బోర్న్ కు పయనమవుతున్న లక్ష్మీపార్వతి!
మార్చి 5 నుంచి రెండు రోజుల పాటు ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో జరగనున్న ‘శ్రీ యాగం – లక్ష్మీ మహా యజ్ఞం’లో వైకాపా మహిళా నేత నందమూరి లక్ష్మీ పార్వతి పాల్గొననున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు ‘ఇంటర్ ఫేయిత్ అండ్ మల్టీ కల్చరల్ కాన్ఫరెన్స్’కు హాజరు కావాలని లక్ష్మీపార్వతిని జేఈటీ ఆస్ట్రేలియా ఫౌండేషన్, మెల్‌బోర్న్ చాప్టర్ ఆహ్వానించింది. మెల్ బోర్న్ లోని శ్రీదుర్గ దేవాలయం, జేఈటీ ఆస్ట్రేలియా ఫౌండేషన్ లు సంయుక్తంగా ఈ శ్రీ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు లక్ష్మీ పార్వతికి పంపిన ఆహ్వానంలో సంస్థ ప్రతినిధి సత్యా రామడుగు వెల్లడించారు. త్రిదండి చినజీయర్ స్వామి, ఆయన శిష్య బృందం జరిపే పర్యటనలో భాగంగా ఈ యాగాన్ని తలపెట్టినట్టు ఆయన తెలిపారు.