: అపోలోకు వచ్చేసరికే జయలలితకు స్పృహ లేదు... ఆరోపించిన మహిళా డాక్టర్ అరెస్ట్


దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఆరోపణలు చేసిన డాక్టర్ రామసీతను చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మ మరణంపై తనకెన్నో అనుమానాలు ఉన్నాయని, ఆమెను ఆసుపత్రికి తీసుకు వచ్చేసరికే స్పృహలో కూడా లేరని, వెంట బంధువులు రాలేదని, ఆమెకు చికిత్స అందిస్తున్న గదివైపు ఏ డాక్టర్ ను కూడా అనుమతించలేదని ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే. అమ్మ మరణంపై విచారణ జరిపించాలని అన్నాడీఎంకే నేతలు సహా పలువురు డిమాండ్ చేస్తున్న వేళ, రామసీత తెరపైకి వచ్చి ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. ఆపై జయ మేనకోడలు దీప, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలను కలిసి ఆమె తన మద్దతు తెలిపారు. కాగా, రామసీతపై మూడు సెక్షన్ల కింద కేసులు పెట్టినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు. ఆమె అసలు డాక్టరే కాదని పోలీసు వర్గాలు వాదిస్తుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News