: రేపు రాష్ట్ర వ్యాప్తంగా కాపు సత్యాగ్రహ దీక్షలు.. కర్నూలులో నేను పాల్గొంటా: ముద్రగడ పద్మనాభం
రేపు రాష్ట్ర వ్యాప్తంగా కాపు సత్యాగ్రహ దీక్షలు చేపడుతున్నామని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కర్నూలులో నిర్వహించే కాపు సత్యాగ్రహ దీక్షలో తాను పాల్గొంటానని చెప్పారు. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత మోసం చేసిందని ఆయన విమర్శించారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాటమార్చడం తగదని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. వచ్చేనెల 26న కాకినాడలో కాపు న్యాయవాదులతో భేటీ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.