: అమెరికాలో తెలుగు ఇంజనీర్ హత్యపై స్పందించిన మమతా బెనర్జీ
అమెరికాలో తెలుగు ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ హత్య పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. శ్రీనివాస్ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆమె... ఆ విషయం గురించి తెలుసుకొని చాలా బాధ పడ్డానని అన్నారు. తాను విద్వేష రాజకీయాలకు ఎప్పుడూ మద్దతు ఇవ్వబోనని తెలిపారు. ఈ ప్రపంచం అంతా ఒక కుటుంబం లాంటిదని పేర్కొన్న ఆమె... వేరు వేరు దేశాల ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా జీవించవచ్చని అన్నారు. దానిని మనమందరం అర్థం చేసుకొని జీవించాలని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో గాయపడిన మరో ఇంజనీర్ మాడసాని అలోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.