: 'నేను ఒంటరిదాన్నికాను' అంటూ జవాన్‌ కూతురు పోస్ట్.. సోషల్ మీడియాలో విద్యార్థిని పోస్ట్ వైరల్


దేశ ద్రోహం ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న జేఎన్‌యూకు చెందిన ఉమర్‌ ఖలీద్‌.. 'రాంజాస్ కళాశాల'కు రావడాన్ని వ్యతిరేకిస్తూ ఏబీవీపీ కార్య‌క‌ర్త‌లు జ‌రిపిన ఆందోళ‌న‌లో 20 మంది విద్యార్థులు గాయపడిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌కు నిరసనగా ఢిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజీ విద్యార్థిని, ఓ జ‌వాను కూతురు గుర్‌మెహార్‌ కౌర్ స్పందిస్తూ సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. కార్గిల్‌ యుద్ధంలో వీరమరణం పొందిన కెప్టెన్‌ మన్‌దీప్‌ సింగ్‌ కూతురే గుర్‌మెహార్‌. ఆ పోస్టులో ఓ ప్ల‌కార్డును ప‌ట్టుకొని ఆమె త‌న నిర‌స‌న తెలిపింది. ఏబీవీపీ దాడి అమాయక విద్యార్థులకు అవాంతరం కలిగించిందని తెలిపింది. ఈ ఘ‌ట‌న‌ నిరసనకారులపై దాడి కాదని, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని పేర్కొంది.

స్వేచ్చ, ఆదర్శాలు, విలువలు, పౌరుడి హక్కులపై దాడి జరిగింద‌ని, ప్రతి భారత పౌరుడు బాధపడ్డాడని గుర్‌మెహార్‌ కౌర్ చెప్పింది. తాను ఢిల్లీ యూనివర్సిటి విద్యార్థినని, ఏబీవీపీకి భయపడనని పేర్కొంది. తాను ఒంటిరిదాన్నికానని త‌న‌కు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల మద్దతు ఉందని తెలిపింది. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

  • Loading...

More Telugu News