: 'బాహుబలి-2'లో ప్రభాస్ పోస్టర్ కూడా కాపీనే అట.. విమర్శలు గుప్పిస్తున్న నెటిజన్లు


రాజమౌళి ప్రతిష్టాత్మక సినిమా 'బాహుబలి-2'కు సంబంధించిన ఏ పోస్టర్ విడుదలైనా విమర్శలపాలు అవుతోంది. మొన్నటికి మొన్న విల్లంబులు చేతబట్టిన అనుష్క, ప్రభాస్ ల ఫొటోను విడుదల చేశాడు జక్కన్న. అంతే, ఆ పోస్టర్లో ఉన్న తప్పులను పట్టుకుని నానా హంగామా చేశారు నెటిజన్లు. ఇప్పుడు తాజాగా మరో పోస్టర్ ను విడుదల చేశాడు రాజమౌళి. ఏనుగు తొండంపై నిలబడి, దాని తలపై కాలు పెట్టిన చిత్రం అది. చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది. కానీ, ఈ ఫొటోపై కూడా నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

కారణం... ఫొటోలోనీ థీమ్ ను రాజమౌళి కాపీ కొట్టాడట. హాలీవుడ్ హీరో టోనీ జా నటించిన 'ఆంగ్ బ్యాక్-2' సినిమా నుంచి ఈ థీమ్ ను జక్కన్న కాపీ కొట్టాడని నెటిజన్లు అంటున్నారు. అంతేకాదు, ఈ రెండు పోస్టర్లను పక్కపక్కనే పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఒక వీడియో రెడీ చేసేసి... యూట్యూబ్ లో సైతం పెట్టేశారు. అయితే, కేవలం థీమ్ ను మాత్రమే వాడుకున్నాడని... సన్నివేశాన్ని మన నేటివిటీకి తగ్గట్టు మార్చాడని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఈ అంశం ట్రెండింగ్ గా మారింది.

  • Loading...

More Telugu News