: ట్రంప్ తీరుపై నిలదీసిన ఏడేళ్ల బాలుడు.. సమాధానం చెప్పలేకపోయిన సెనేటర్‌!


సెనేటర్ తెల్ల‌మొహం వేసుకునేలా ఓ బాలుడు ప్ర‌శ్నించిన ఘ‌ట‌న అమెరికాలోని ఆర్క‌న్సాస్‌లో తాజాగా చోటుచేసుకుంది. ఓ కార్యక్రమానికి రిపబ్లికన్‌ సెనేటర్‌ టామ్‌ కాటన్ హాజ‌రై స్థానికులు అడుగుతున్న‌ ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు. ఇంత‌లో ఓ ఏడేళ్ల బాలుడు మెక్సికో, అమెరికాకు మ‌ధ్య గోడ నిర్మించాల‌ని చూస్తోన్న త‌మ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుపై మండిప‌డ్డాడు. ఆ గోడ గురించి చిన్నారి టోబీ స్మిత్‌ సెనేటర్‌ను ప్రశ్నిస్తూ..  ట్రంప్ ఆ గోడ ఎందుకు కట్టాలని అనుకుంటున్నారని అడిగాడు.

'మెక్సికన్లు తమకు అంత ముఖ్యమైన వాళ్లు కాదని ట్రంప్ అంటున్నారు.. కానీ ఆర్కన్సాస్‌లో ఉండే వారికి మెక్సికన్లు అంటే ఇష్టం' అని ఆ బాలుడు పేర్కొన్నాడు. పిల్లలకు వినోదాన్నిచ్చే పార్కుల వంటివి తొలగించి గోడను కట్టాలని అనుకుంటున్నారని, గోడ నిర్మాణం కోసం ఇటువంటి పనులు చేయడం భావ్యంకాదని అన్నాడు. ఆ బాలుడు మాట్లాడిన తీరుకి ఆ స‌భ‌లోని వారంతా హ‌ర్ష‌ధ్వానాలు వ్య‌క్తం చేశారు. ఆ చిన్నారికి ఏ సమాధానం చెప్పాలో సెనేటర్‌కి తెలియ‌లేదు.

  • Loading...

More Telugu News