: మోదీని ఉద్దేశిస్తూ 'అమితాబ్ పాట' పాడిన అఖిలేష్ యాదవ్ భార్య!


ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం రక్తి కట్టిస్తోంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి పార్టీల నేతలు పడని పాట్లు లేవు. ముఖ్యంగా కేవలం బీజేపీని అడ్డుకోవడానికే చేతులు కలిపిన సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ లు ప్రధాని మోదీని ఫుల్ గా టార్గెట్ చేశాయి. గుజరాత్ గాడిదలకు ప్రచారం ఆపేయాలంటూ ముఖ్యమంత్రి అఖిలేష్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అఖిలేష్ భార్య డింపుల్ కూడా మోదీపై విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు.

ఓ ఎన్నికల సభలో 'మేరే అంగనే మే... తుమ్హారా క్యా కామ్ హై' అంటూ మోదీని ఉద్దేశించి పాట పాడారు. అమితాబ్ బ్లాక్ బస్టర్ మూవీ 'లావారిస్'లోని పాట ఇది. మా ఇంట్లో (యూపీలో) మీకు ఏం పని అని అర్థం వచ్చేలా ఆమె ఈ పాట పాడారు. ఆమె ఈ పాట పాడగానే సభలోని జనాల్లో భారీ స్పందన వచ్చింది. డింపుల్ భాభీ అంటూ అక్కడున్న వందలాది మహిళలు నినదించారు. అంతేకాదు... ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' అంటూ రేడియోలో మాట్లాడుతున్నారు కానీ... 'కామ్ కీ బాత్' (పనికొచ్చే మాటలు) మాత్రం మాట్లాడటం లేదని విమర్శించారు.

  • Loading...

More Telugu News