: దుష్ప్రచారం చేస్తున్నారు.. మాలో లుకలుకలు ఉన్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదు: టీజేఏసీ


హైదరాబాద్ నాంపల్లిలోని టీజేఏసీ కార్యాలయంలో ప్రొ.కోదండరాం అధ్యక్షతన ఈ రోజు స‌ద‌రు క‌మిటీ నేతలు సమావేశమయ్యారు. ఇటీవ‌ల నిర్వ‌హించిన నిరుద్యోగ ర్యాలీని పోలీసులు అడ్డుకున్న నేప‌థ్యంలో త‌మ‌ తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఈ సంద‌ర్భంగా టీజేఏసీ నేత‌లు మీడియాతో మాట్లాడుతూ క‌మిటీలో లుకలుకలు ఉన్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. కొందరు పనిగట్టుకొని తమపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ‌లోని నిరుద్యోగుల సమస్యలపై తదుపరి కార్యాచరణను చేపట్టేందుకు ఎల్లుండి విద్యార్థి, యువజన సంఘాలతో స‌మావేశం నిర్వహించాలని తాము నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు.

స‌ర్కారు నిర్బంధ ధోరణి అవలంబించినా త‌మ పోరాటం ఆప‌బోమ‌ని కోదండరాం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మైనార్టీల సమస్యలపై సుధీర్‌ కమిటీ సిఫార్సులను అమలుచేయాలని స‌ర్కారుపై ఒత్తిడి తేవాలని నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తామ‌న్నారు. వ‌చ్చేనెల‌ 1న మహబూబ్‌నగర్‌, 4న నిర్మల్‌, 5న కరీంనగర్‌, 11న వరంగల్‌ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. 

  • Loading...

More Telugu News