: ట్రంప్ కుమార్తె పేరు కోసం చైనా కంపెనీల ఆరాటం!


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నిలిచినప్పటి నుంచి ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్ బాగా పాప్యులర్ అయ్యారు. తన అందచందాలతో ఇవాంక ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీ అయ్యారు. ఇక చైనా విషయానికి వస్తే... ఆమె పేరుకు కూడా ఎక్కడా లేని పాప్యులారిటీ వచ్చేసింది. ఆమె పేరు మీద కాస్మెటిక్ సర్జరీలు కూడా వచ్చేశాయి. ఇవాంక లాగా కనిపించాలంటే... కాస్మెటిక్ సర్జరీ చేస్తామంటూ ఓ చైనా కంపెనీ ప్రకటిస్తోంది. ఆమె పేరు కోసం చైనా కంపెనీలు పెనుగులాడుతున్నాయి.

ఇవాంక ట్రంప్ పేరునో, లేదా అలాంటి ఉచ్చారణతో ఉండే పేరునో తమ బ్రాండ్ లకు పెట్టుకునే అవకాశం ఇవ్వాలంటూ ఎన్నో కంపెనీలు చైనాలో దరఖాస్తు చేసుకుంటున్నాయి. ఇవాంక పేరుతో తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో స్పా సర్వీసులు, డైట్ పిల్స్, చర్మం ముడతలు పడకుండా కాపాడే క్రీములు, మసాజ్ మెషీన్లు, లో దుస్తులు, శానిటరీ నాప్ కిన్లు, కాస్మొటిక్ సర్జరీలు ఉన్నాయి. ఇవాంక ట్రంప్ దేవతలా కనిపిస్తోందని చైనా నెటిజన్లు చెప్పుకుంటున్నారట.

  • Loading...

More Telugu News