: పన్నీర్ సెల్వం డిమాండ్ సరైనదే: డీఎంకే
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు ప్రతిపక్ష డీఎంకే మద్దతుగా నిలిచింది. దివంగత జయలలిత మృతిపై అందరికీ అనుమానాలు ఉన్నాయని... ఆమె మరణంపై విచారణ జరిపించాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ మాట్లాడుతూ, తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కు కూడా ఇవే అనుమానాలు ఉన్నాయని... పన్నీర్ సెల్వం డిమాండ్ సరైనదే అని అన్నారు. జయ మరణం వెనుక కచ్చితంగా ఏదో మిస్టరీ ఉందని చెప్పారు. అసలు జయను ఆసుపత్రిలో ఎందుకు చేర్చారు? ఆమెకు ఏమైంది? ఎలాంటి ట్రీట్ మెంట్ ఇచ్చారు? అనే విషయాలు ప్రజలకు తెలియాల్సిందే అని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.