: కుంగ్‌ఫూతో అదరగొడుతున్న 94 ఏళ్ల బామ్మ... ఇంటర్‌నెట్‌లో వీడియో హ‌ల్‌చ‌ల్!


చైనాకి చెందిన 94 ఏళ్ల ఝాంగ్ అనే ఓ బామ్మ ఇప్పుడు ఆ దేశంలో ఇంటర్‌నెట్‌ సెన్సేషన్‌గా మారింది. ఇన్నేళ్ల వ‌య‌సులోనూ ఆమె ఎంతో చ‌లాకీగా ఉంటుంది. త‌న ప‌ని తానే చేసుకుంటూ ఎవ‌రిమీదా ఆధార‌ప‌డ‌కుండా జీవిస్తోంది. దీనంత‌టికీ కార‌ణం ఆమెకు తెలిసిన కుంగ్‌ఫూ విద్య‌నే. ఆ బామ్మ‌ గురించిన విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోవడం అంద‌రి వంతు అవుతుంది. 4 ఏళ్ల వయసు ఉన్న‌ప్పుడే కుంగ్‌ఫు నేర్చుకోవడం మొదలుపెట్టిన ఈ బామ్మ ఇప్ప‌టికీ ఆ విద్య‌ను ప్ర‌ద‌ర్శిస్తూనే ఉంది. అప్పుడు త‌మ‌ దేశంలో యుద్ధం జరుగుతోంది కాబట్టి, ఆత్మరక్షణ కోసం కుంగ్‌ఫు నేర్చుకున్నాన‌ని చెబుతోంది. కుంగ్‌ఫు కార‌ణంగానే ఈ 94 ఏళ్ల జీవితంలో తానెప్పుడూ ఆసుప‌త్రికి వెళ్లలేదని గర్వంగా అంటోంది.

కుంగ్‌ ఫులో 15 శైలులు, ఒక్కో శైలిలో 36 మూవ్స్ ఏ మాత్రం త‌డ‌బ‌డకుండా చేసేస్తోంది. ఇప్పటికీ ప‌లువురికి ఆమె కుంగ్‌ఫు శిక్షణ ఇస్తూనే ఉంది. యువతకు స‌మానంగా ఆమె కుంగ్ ఫు చేస్తోంది. త‌న చిన్న‌త‌నంలో తిన‌డానికి తిండిలేక ఎంతో క‌ష్ట‌ప‌డ్డాన‌ని చెబుతోంది. తాను తెల్లవారుఝామున లేచి కుంగ్‌ఫు సాధన చేసేసరికి ఒళ్లంతా పచ్చిపుండయ్యేదని చెప్పింది. సాధ‌న అనంత‌రం ఆకలితో ఇంటికొస్తే తినడానికి ఏమీ లేక ఏడ్చేదాన్నని అంటోంది. ఇప్పుడు తాను స‌రిప‌డ నిద్ర, తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం, కుంగ్‌ఫు సాధన, పాజిటివ్ థింకింగ్ తో జీవిస్తున్నాన‌ని అదే త‌న ఆరోగ్య ర‌హ‌స్య‌మ‌ని చెబుతోంది. చైనా ఇంట‌ర్నెట్‌లో ఇప్పుడామె వీడియోలు విప‌రీతంగా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఆమెను ఇప్పుడు ఆ గ్రామస్థులంతా ఆదర్శంగా తీసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News