: ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియా
పూణే వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలిటెస్టు మ్యాచులో ఆస్ట్రేలియా జట్టు టీమిండియా ముందు 440 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన విషయం తెలిసిందే. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఆదిలోనే తడబడింది. ఓపెనర్ మురళీ విజయ్ కేవలం 2 పరుగులకే వెనుదిరగగా, అనంతరం మరో ఓపెనర్ రాహుల్ కూడా 10 పరుగులకే ఔటయ్యాడు. తదుపరి క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 13 పరుగులు చేసి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో పుజారా 15, రహానే 3 పరుగులతో ఉన్నారు. ఆసిస్ బౌలర్లలో లియాన్ 1, ఓకీఫ్ 2 వికెట్లు తీశారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 52/3 (18 ఓవర్లకు) గా ఉంది.