: మతిలేని హింసకు, మతవిద్వేషానికి తావులేదు: ‘తెలుగువారిపై కాల్పుల’పై సత్య నాదెళ్ల
అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రం ఒథాలే ప్రాంతంలో ఉన్న ఆస్టిన్స్ బార్‌లో జరిగిన కాల్పుల ఘటనలో హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్పందిస్తూ... మన సమాజంలో ఇలాంటి మతిలేని హింసకు, మతవిద్వేషానికి తావులేదని వ్యాఖ్యానించారు. ఈ కాల్పుల ఘటనలో బాధితులైన కుటుంబాలకు తన సానుభూతి తెలుపుతున్నట్లు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. బాధితుల కుటుంబాలని ఆదుకుంటానని తెలిపారు. ఈ కాల్పుల ఘటనలో శ్రీనివాస్ స్నేహితుడు అలోక్‌రెడ్డికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.
There’s no place for senseless violence & bigotry in our society. My heart is with the victims & families of the horrific shooting in Kansas
— Satya Nadella (@satyanadella) 25 February 2017