: కవితకు లండన్ లో గ్రాండ్ వెల్ కమ్!


టీఆర్ఎస్ ఎంపీ కవితకు లండన్ లో ఘన స్వాగతం లభించింది. కామన్ వెల్త్ దేశాల మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనేందుకు ఆమె లండన్ వెళ్లారు. 27వ తేదీ వరకు ఆమె అక్కడే ఉంటారు. చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం, మహిళా పార్లమెంటేరియన్లను ప్రోత్సహించడం వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. దేశాల వారీగా మహిళల సమస్యలు, మహిళా పాలసీ రూపకల్పన, పార్లమెంటులో మహిళల సమస్యలు, సవాళ్లు తదితర అంశాలపై సెమినార్లను నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు హాజరవడం కోసం లండన్ వెళ్లిన కవితకు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్ డం సభ్యులు ఆమెకు వెల్ కమ్ చెప్పారు. ఈ పర్యటనలో మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనడమే కాకుండా... తెలంగాణ జాగృతి-యునైటెడ్ కింగ్ డం నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంలో కూడా ఆమె పాల్గొంటారు.  

  • Loading...

More Telugu News