: ట్రంప్ తీరుపై మండిపడ్డ భారత సంతతి మహిళా సెనెటర్!
అమెరికాలోని కాన్సస్ స్టేట్ లో జరిగిన జాత్యహంకార దాడిపై అమెరికా ప్రభుత్వం బుకాయించడం మొదలుపెట్టింది. ఈ మేరకు వైట్ హౌస్ అధికార ప్రతినిధి సియాన్ స్పైసర్ ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలకు, తెలుగు ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ హత్యకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. దీనిపై భారతీయ సంతతి సెనెటర్ కమల హారిస్ మండిపడ్డారు. విద్వేషం విజయం సాధించకుండా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. మరో భారతీయ సంతతి అమెరికా ప్రతినిధుల సభ మెంబర్ పరిమళ జైపాల్ మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తరువా దేశంలో విద్వేషాలు పెరిగాయని అన్నారు.