: మీడియాను నిషేధించిన ట్రంప్... వెంటనే షాకిచ్చిన మీడియా సంస్థలు!


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా సంస్థలపై చర్యలు ప్రారంభించారు. దీనికి ప్రతిగా మీడియా సంస్థలు ప్రెసిడెంట్ బ్రీఫింగ్ కార్యక్రమాన్ని బహిష్కరించిన ఘటన వాషింగ్టన్ లో చోటుచేసుకుంది. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియా సంస్థలపై డొనాల్డ్ ట్రంప్ చర్యలు తీసుకున్నారు. వైట్ హౌస్ లో ఆ సంస్థల ప్రతినిధులు ప్రెస్ బ్రీఫింగ్ కు రాకుండా నిషేధం విధించారు. ఈ జాబితాలో సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్, లాస్ ఏంజెల్స్ టైమ్స్ తదితర సంస్థలు ఉన్నాయి. అంతే కాకుండా మీడియా ప్రతినిధులతో డొనాల్డ్ ట్రంప్ ఆన్ కెమెరా కాకుండా ఆఫ్ కెమెరా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోకి కెమెరా లేకుండా రావాలని సూచించి, తనిఖీలు నిర్వహించారు. దీంతో ఆగ్రహించిన పలు మీడియా సంస్థలకు చెందిన మీడియా ప్రతినిధులు సమావేశంలో పాల్గొనకుండా వెనుదిరిగి ట్రంప్ కు షాకిచ్చారు. 

  • Loading...

More Telugu News