: కాస్త త్వరగా పెళ్లి చేసుకోండి... చైతన్య, సమంతలపై నాగార్జున ఒత్తిడి?


అక్కినేని అఖిల్, శ్రియాభూపాల్ ల వివాహం రద్దయిందనే వార్త మీడియాలో వచ్చినప్పటికీ... ఇటు నాగార్జున కుటుంబం కాని, అటు జీవీకే కుటుంబం కానీ అధికారికంగా స్పందించలేదు. అయినప్పటికీ, పెళ్లి క్యాన్సిల్ కావడం మాత్రం పక్కా అనే వార్త వినిపిస్తోంది. మరోవైపు, అఖిల్ పెళ్లి క్యాన్సిల్ కావడంతో... నాగచైతన్య, సమంతలపై ఒత్తిడి పెరుగుతోందని విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి అఖిల్ పెళ్లి మేలో చేసి... చైతన్య-సమంతల పెళ్లి ఈ ఏడాది చివర్లో చేయాలని నాగార్జున ప్లాన్ చేసుకున్నారు.

కానీ ఊహించని విధంగా అఖిల్ పెళ్లి క్యాన్సిల్ కావడంతో... ఇదే ముహూర్తానికి చైతూ, సమంతల వివాహం చేయాలని నాగ్ భావిస్తున్నారట. ఈ విషయం గురించి ఇప్పటికే వీరిద్దరితో నాగ్ మాట్లాడారని... కొంచెం ఒత్తిడి కూడా తీసుకొచ్చారని టాక్. మరోవైపు తమ పెళ్లికి ఇంకా చాలా సమయం ఉండటంతో చెరో రెండు సినిమాలు అంగీకరించారు చైతూ, సమంత. అయితే, నాగార్జున కోరుకుంటే మాత్రం ముందుగానే పెళ్లి చేసుకోవడానికి ఇద్దరూ సిద్ధంగానే ఉన్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News