: భారీ ఆధిక్యంలో నిలిచిన ఆస్ట్రేలియా...భారత్ లక్ష్యం 441


పూణే వేదికగా జరుగుతున్న తొలిటెస్టులో ఆస్ట్రేలియా జట్టు భారీ ఆధిక్యంలో నిలిచింది. 285 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ముగించిన ఆస్ట్రేలియా జట్టు 440 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. బౌన్సీ పిచ్ పై ఎన్నో అంచనాలతో బౌలింగ్ కు దిగిన భారత జట్టు అంచనాల మేరకు రాణించలేకపోయింది. బౌలింగ్, బ్యాటింగ్ లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. దీనికి తోడు టీమిండియా ఫీల్డింగ్ లోపాలు, జారవిడిచిన క్యాచ్ లు జట్టుకు భారంగా మారాయి. ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా పేలవమైన బ్యాటింగ్ కారణంగా 155 పరుగుల ఆధిక్యంలో నిలిచిన ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ లో ఊహించని విధంగా పుంజుకుని 87 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌట్ అయింది.

ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లలో వార్నర్ (10) షాన్ మార్ష్ (0), స్టీవ్ స్మిత్ (109), మిచెల్ మార్ష్ (31), రెన్ షా (31), కోంబ్ (19), మాధ్యూ వేడ్ (20), మిచెల్ స్టార్క్ (30), ఒకీఫ్ (6), లియాన్ (13), హాజిల్ వుడ్ (2) నాటౌట్ గా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియాకు భారత్ పై 440 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో టెస్టులో మరోసారి టీమిండియా ఆటగాళ్లు పుంజుకుని అద్భుతమైన రీతిలో రాణించి విజయం సాధిస్తే టీమిండియా ర్యాంకింగ్ కు వచ్చిన నష్టమేమీ లేదు. కాగా, భారత్ కు రెండున్నర రోజుల ఆట మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో భారత్ నిలకడ ప్రదర్శిస్తే విజయం సాధించడం పెద్ద కష్టం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, టీమిండియాకు ఒకీఫె నుంచి పెను ప్రమాదం పొంచి ఉంది. 

  • Loading...

More Telugu News