: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్!
మీరు సినీ అభిమానులా? ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా? క్లూ కూడా ఇస్తున్నాము... ఈ హీరోయిన్ నాగార్జునతో ఒక సినిమాలో నటించింది. తెలుగులో ఆమె నటించిన సినిమా ఆ ఒక్కటే కావడం విశేషం. బాలీవుడ్ నుంచి దిగుమతైన హీరోయిన్లలో ఒక్క పాటతో ఈ హీరోయిన్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంకా గుర్తురాలేదా? అనుష్కతో కలిసి టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ చిన్నదాని పేరు అయేషా టకియా... 'సూపర్' సినిమాలో నాగార్జున లవర్ పాత్రలో నటించింది. తెలుగులో ఆమె నటించిన ఏకైక సినిమా అది.
ఈ సినిమా తరువాత హిందీలో సల్మాన్ ఖాన్ తో జతగా వాంటెడ్ (తెలుగులో పోకిరి) సినిమాలో నటించింది. తరువాత ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకుడు అబు అజ్మీ కుమారుడు అనీస్ ఆజ్మీని వివాహం చేసుకున్న అయేషా ఆ తరువాత వెండితెరపై కనిపించలేదు. కుమారుడ్ని కన్న తరువాత ఆమె పెదాలకు చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ వికటించిందని, దీంతో ఆమె ఊహించని విధంగా తయారైందని ఆమె ఫోటోలు చెబుతున్నాయి. చిత్రమేంటంటే...ఆమెతో నటించిన వారు కూడా ఆమెను గుర్తుపట్టలేకపోవడం విశేషం.