: కోర్టుకు వచ్చి, పుట్టు మచ్చలు చూపించు!: హీరో ధనుష్ కు కోర్టు ఆదేశం


తమిళ యంగ్ హీరో, రజనీకాంత్ అల్లుడు ధనుష్ తమ కుమారుడే అంటూ కదిరేశన్, మీనాక్షి దంపతులు మధురై కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో, ఈ కేసుకు సంబంధించి కోర్టులో ఇప్పటికే పలుమార్లు విచారణ జరిగింది. ధనుష్ చెన్నైలోని స్కూల్లో చదువుకున్న ఆధారాలను, 2002లో ఉద్యోగం కోసం సమర్పించిన ఆధారాలను కదిరేశన్, మీనాక్షి దంపతులు కోర్టుకు అందజేశారు. మరోవైపు వీరు కోర్టుకు సమర్పించిన టీసీలో ధనుష్ పుట్టు మచ్చల వివరాలు ఉన్నాయి. అయితే, ధనుష్ కోర్టుకు సమర్పించిన 10వ తరగతి టీసీలో గుర్తింపు ఆధారాలను పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో, ఈ నెల 28వ తేదీ లోగా ధనుష్ నేరుగా కోర్టుకు హాజరు కావాలని... పుట్టు మచ్చల వివరాలు ఇవ్వాలని మధురై కోర్టు ఆదేశించింది.  

  • Loading...

More Telugu News