: అరవింద్ స్వామితో సినిమాకు ప్రియమణి 'నో' చెప్పడానికి కారణమిదే!


తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి, ప్రేక్షకులను అలరించింది ప్రియమణి. దక్షిణాది అన్ని భాషల్లో నటించి, అగ్ర నటిగా గుర్తింపు పొందింది ఈ మలయాళ భామ. ఆ తర్వాత ప్రేమ వివాహం చేసుకుని, ఇతర భాషల సినిమాలకు దూరమైంది. కేవలం మలయాళంలోనే నటిస్తోంది.  ప్రస్తుతం ఆమె దుబాయ్ లో ఉంటోంది.

ఈ నేపథ్యంలో, సెల్వ దర్శకత్వంలో అరవింద్ స్వామి నటిస్తున్న సినిమాలో ప్రియమణికి ఆఫర్ వచ్చింది. అయితే ఈ ఆఫర్ కు ప్రియమణి 'నో' చెప్పిందట. దీనికి కారణం... ఆమెకు ఇచ్చింది అరవింద్ స్వామికి స్నేహితురాలి పాత్ర అట. దీంతో, ప్రియమణి రెస్పాన్స్ కాలేదట. దీంతో, ప్రియమణి స్థానంలో సిమ్రాన్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో సిమ్రాన్ పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తుందట. అరవింద్ స్వామికి సహాయం చేసే క్రమంలో, సినిమా మొత్తం ఆమె కనిపిస్తుంది.

  • Loading...

More Telugu News