: 'ముఠామేస్త్రి' నిర్మాత శేఖర్ బాబు మృతి
టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత శేఖర్ బాబు గుండెపోటుతో మృతి చెందారు. నేటి తెల్లవారు జామున హైదరాబాదు జర్నలిస్టు కాలనీలోని ఆయన స్వగృహంలో ఆయన కన్నుమూశారు. చిరంజీవి, రోజా, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన హిట్ సినిమా 'ముఠామేస్త్రి'తో పాటు, పక్కింటి అమ్మాయి, గోపాలరావు గారి అమ్మాయి,సర్దార్, సుబ్బరాజు గారి కుటుంబం వంటి సినిమాలను ఆయన నిర్మించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు.