: రోడ్డు ప్రమాదంలో పొన్నం ప్రభాకర్ కు గాయాలు
వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ కారు యాక్సిడెంట్ కు గురైంది. వేములవాడ రాజన్నను దర్శించుకుని వెనుదిరిగిన ప్రభాకర్ కారు వేములవాడ మండలం నాంపల్లి వద్దకు రాగానే బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ఈ యాక్సిడెంట్ లో పొన్నం ప్రభాకర్ భుజానికి గాయమైనట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం. సంఘటనా స్థలం నుంచి కారు కదిలే పరిస్థితి లేకపోవడంతో స్థానికుల సాయంతో ఆయన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రధాన ఆసుపత్రికి తరలించారు.