: శివనామస్మరణతో హోరెత్తిన దేవాలయాలు... జాగారం చేసి తరించిన భక్తులు!
దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలన్నీ పరమశివుని నామస్మరణతో హోరెత్తిపోయాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నిన్న శివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ ఆలయాలన్నీ శివనామస్మరణతో పులకించిపోయాయి. తెల్లవార్లూ జాగారమున్న భక్తులు, ఈ వేకువఝామునే పవిత్ర స్నానమాచరించారు. శ్రీశైల మల్లన్న, మహానంది, ఓంకారం, యాగంటి, కాల్వబుగ్గ శైవక్షేత్రం, విజయవాడలోని మల్లికార్జున స్వామి దేవాలయం, కర్నూలు సంగమేశ్వర స్వామి ఆలయాలను భారీ ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. తెలంగాణలోని వివిధ పుణ్యక్షేత్రాల వద్ద కూడా రద్దీ నెలకొంది.