: పన్నీర్ సెల్వంను పురుగుతో పోల్చిన శశికళ భర్త నటరాజన్


అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం జైలులో వున్న శశికళ భర్త నటరాజన్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను పురుగుతో పోల్చి అవమానించారు. జయలలిత జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తాను అన్నాడీఎంకే కార్యకర్తగా పార్టీ కోసం పనిచేస్తానని, పార్టీ కోసం ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నానని, ఉంటానని అన్నారు.

పన్నీర్‌ సెల్వం గురించి మాట్లాడుతూ, ఏనుగు మృతి చెందిన అనంతరం దాని మృతదేహం చుట్టూ పురుగులు చేరినట్టుగా అమ్మ మృతి అనంతరం సీఎం పదవి కోసం పన్నీర్ సెల్వం వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. కాగా, నటరాజన్ గతంలో పార్టీ కార్యకలాపాల్లో కలుగజేసుకుంటుండడంతో జయలలిత ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి, పొయేస్ గార్డెన్ నుంచి వెళ్లగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడాయన శశికళ భర్తగా మళ్లీ పార్టీ పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్నారు. 

  • Loading...

More Telugu News