: పెళ్లా? మనం అనుకుంటే జరగదండీ!: ప్రభాస్


పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అంటూ టీవీ ఇంటర్వ్యూలో సుమ అడిగిన ప్రశ్నకు ప్రభాస్ నవ్వేశాడు. 'పెళ్లంటే ఎందుకు భయపడుతున్నారు? ఎవరినైనా చూసి భయపడుతున్నారా?' అంటూ సమ మళ్లీ రెట్టించింది. దీంతో మళ్లీ నవ్వేసిన ప్రభాస్ సమాధానమిస్తూ... 'అలాంటిదేమీ లేదండీ. పెళ్లి మనం అనుకుంటే జరగదండీ' అన్నాడు. 'ఇంత వరకు అది వర్కవుట్ కాలేదు, అంతే.. ఇంట్లో వాళ్లు కూడా పెళ్లి అంటున్నారు... చూడాలి ఏం జరుగుతుందో' అన్నాడు. ఏదైనా 'బాహుబలి 2' విడుదల తరువాతేనని తేల్చిచెప్పాడు. ఇంతవరకు ఏ అమ్మాయిని చూళ్లేదని, పుకార్లు సాధారణమని చెప్పాడు. తన పెళ్లి కుదిరితే అన్ని టీవీలు, పేపర్లలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది కదా చూడండి అన్నాడు.  

  • Loading...

More Telugu News