: ఇంటర్వ్యూలో తిరస్కారమే అతనిని బిలియనీర్ ను చేసింది!


వాట్స్ యాప్ కు నేటితో 8 వసంతాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో వాట్స్ యాప్ ఆవిర్భావం గురించి ఓసారి గుర్తు చేసుకుందాం. ఆ కథలోకి వెళ్తే... యాహూ సంస్థలో బ్రియాన్ ఆక్టన్, జాన్ కౌమ్ కలిసి పనిచేశారు. వీరిద్దరికీ యాహూలో ఉద్యోగం విసుగుతెచ్చింది. కొత్తగా ఏదైనా చేయాలని భావించారు. దీంతో బ్రియాన్ ఆక్టన్ కు ఫేస్‌ బుక్‌ సంస్థలో ఉద్యోగం చేయాలనే బలమైన కోరిక ఉండేది. దీంతో ఎలాగైనా ఫేస్ బుక్ లో ఉద్యోగం సంపాదించాలని భావించి, యాహూలోని అనుభవాన్ని చూపుతూ 2009 లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కారణాలేవైతేనేం... ఆయనకు ఉద్యోగం దొరకలేదు. దీంతో ట్విట్టర్ లో ఉద్యోగం కోసం వెళ్లాడు. అక్కడా అదే అనుభవం ఎదురైంది.

దీంతో అవమానంగా ఫీలయ్యాడు. అది ఉక్రోషంగా మారింది. దీంతో పట్టుదలగా తానే ఏదైనా చేయాలని భావించాడు. దీంతో తన స్నేహితుడు జాన్ తో కలిసి ఆలోచించి వాట్స్ యాప్ ను రూపొందించాడు. 2009 ఫిబ్రవరి 24న వాట్స్ యాప్‌ ను ఆవిష్కరించారు. దీంతో అది ఏ స్థాయిలో సంచలనం స‌ృష్టించిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో 2014 లో వాట్స్ యాప్‌ ను 19 బిలియన్ డాలర్లకు ఫేస్‌ బుక్ హస్తగతం చేసుకుంది. దీంతో బ్రియాన్, జాన్ జాతకాలు మారిపోయాయి. ఫేస్ బుక్ లో ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఈ ఇద్దరు అదే ఫేస్ బుక్ డబ్బుతో బిలియనీర్లయ్యారు. చైనాకు చెందిన ఈ కామర్స్ సంస్థ యజమాని జాక్ మా కూడా ఇలా వివిధ ఇంటర్వ్యూలలో విఫలమైన తరువాతే ప్రపంచం గర్వించదగ్గ వ్యాపారవేత్తగా ఎదిగారు. దీంతో వైఫల్యం సరికొత్త చరిత్రకు నాంది పలుకుతుందని గుర్తించాల్సిన అవసరం ఉంది. 

  • Loading...

More Telugu News