: ఏపీలో డిప్యూటీ కలెక్టర్ గా పీవీ సింధు !
రియో ఒలింపిక్స్ రజత పతకం విజేత పీవీ సింధు డిప్యూటీ కలెక్టర్ బాధ్యతలు స్వీకరించనుంది. ఈ విషయాన్ని ఆమె తల్లి విజయ తెలిపారు. ఒక వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ, ఒలింపిక్ పతకం గెలిచిన తరువాత సింధు కోరుకుంటే ప్రభుత్వోద్యోగం ఇస్తామని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రకటించారని ఆమె గుర్తుచేశారు. ఏపీ సీఎం చంద్రబాబు అప్పట్లో ఆమె ఒప్పుకుంటే గ్రూప్ వన్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగమిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సింధుకు ఏపీ ప్రభుత్వం సూచించిన ఆఫర్ కు అంగీకరించినట్టు ఆమె తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆమెకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపిందని ఆమె చెప్పారు. కాగా, 21 ఏళ్ల సింధు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) హైదరాబాదు కార్యాలయంలో 2013 నుంచీ అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఇకపై డిప్యూటీ కలెక్టర్ గా ఆమె ఏపీలో బాధ్యతలు స్వీకరించనున్నారు.