: కాన్పూర్ రైలు ప్రమాదంలో సూత్రధారి పాకిస్థాన్: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో మోదీ
కాన్పూర్ లో చోటుచేసుకున్న రైలు ప్రమాదం వెనుక పాకిస్థానీ ఉగ్రవాదుల హస్తముందని ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాన్పూర్ రైలు ప్రమాదం అనంతరం ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల హస్తమున్నట్టు అనుమానం ఉందంటూ కథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ఆ తరువాత ఈ ప్రమాద ఘటనపై ఎవరూ మాట్లాడలేదు. ఉత్తరప్రదేశ్ లో ఐదో దశ ఎన్నికలు సోమవారం జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాన్పూర్ రైలు ప్రమాదంపై ప్రధాని మాట్లాడడం ఆసక్తి రేపుతోంది.
పాకిస్థాన్ లో కూర్చున్న కొంత మంది ఈ దుర్ఘటన వెనుక ఉన్నారని ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించి కొందరు అరెస్టయ్యారని, ఇది ముమ్మాటికీ పాకిస్థాన్ విద్రోహ చర్యేనని ఆయన తెలిపారు. కుట్రదారులు సరిహద్దుల అవతల ఉన్నారని, సరిహద్దులను పటిష్ఠంగా ఉంచుకోవాలని ఆయన అన్నారు.