: ఫిబ్రవరి 24... సచిన్ కు ఎంతో ప్రత్యేకమైన రోజు ఇది!
ఫిబ్రవర్ 24వ తేదీ... క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు ఈ రోజు అత్యంత కీలకమైనది. సరిగ్గా ఏడేళ్ల క్రితం... అంటే 2010 ఫిబ్రవరి 24న వన్డే క్రికెట్లో తొలి డబుల్ సెంచరీ నమోదయింది. గ్వాలియర్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో చరిత్రలోనే తొలి వన్డే డబుల్ సెంచరీని సచిన్ టెండూల్కర్ సాధించాడు. ఆ మ్యాచ్ లో సచిన్ 200 పరుగులు చేసి, నాటౌట్ గా నిలిచాడు. దీంతో, భారత్ మూడు వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించగా... సచిన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. డబుల్ సెంచరీని చేసిన సచిన్... ఆ రాత్రి నిద్ర లేకుండానే గడిపాడట. సంతోషంతో సచిన్ కు నిద్ర పట్టలేదట. ఫోన్ లో మెసేజ్ బాక్స్ మొత్తం అభినందనలతో నిండిపోయిందని... వాటిని, చదువుతూ, రిప్లై ఇస్తూ గడిపానని తన ఆత్మకథ 'ఫ్లయింగ్ ఇట్ మై వే'లో తెలిపాడు.