: అత్త పెన్నుకూడా నాకొద్దు...ఆమె దీవెనలు చాలు: జయ మేనకోడలు దీప
తన అత్త దివంగత ముఖ్యమంత్రి జయలలిత పెన్ను కూడా తనకు వద్దని దీపా జయకుమార్ తెలిపారు. నేటి ఉదయం మెరీనా బీచ్ లోని జయలలిత సమాధిని సందర్శించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, తనకు జయలలిత ఆస్తులు అవసరం లేదని అన్నారు. తాను అత్త ఆస్తుల కోసం పోరాడడం లేదని, తనకు అత్త దీవెనలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికీ అత్త తనతోనే ఉన్నారని చెప్పారు. గతేడాది ఇదే రోజున తన అత్తను విష్ చేశానని గుర్తుచేసుకున్నారు. తాను పన్నీర్ సెల్వంతో కలవడం లేదని చెప్పారు. ఆర్కేనగర్ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. తానే జయలలిత అసలు వారసురాలినని ఆమె స్పష్టం చేశారు.