: కేసీఆర్ మొక్కు చెల్లింపులు చట్ట విరుద్ధం.. హైకోర్టును ఆశ్రయిస్తాం: మర్రి శశిధర్ రెడ్డి


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ దేవుళ్లకు చెల్లించుకుంటున్న మొక్కులు చట్ట విరుద్ధమని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఆదాయం ఎక్కువగా ఉండే ఆలయాల నుంచి సేకరించే కామన్ గుడ్ ఫండ్ ను... శిథిలావస్థలో ఉన్న ఆలయాలను బాగు చేయడానికి ఉపయోగించాలని ఆయన చెప్పారు. అంతేకాని, ఆ ఫండ్ తో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల దేవస్థానానికి కోట్లాది రూపాయలతో ఆభరణాలను చేయించడం చట్ట విరుద్ధమని అన్నారు. ఈ విషయంపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

ఇక ఇందిరాపార్క్ నుంచి ధర్నా చౌక్ ను తరలించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని... ఇది నిరంకుశమైన చర్య అని శశిధర్ రెడ్డి మండిపడ్డారు. నిరసన తెలపడం ప్రజాస్వామ్య దేశంలో ఓ హక్కు అని చెప్పారు. ఈ ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News