: మరో దారుణానికి తెగబడ్డ ఐసిస్.. సైనికాధికారుల తలలు నరికి చంపిన వైనం!


నెత్తుటి ఏర్లు పారిస్తున్న ఉగ్రసంస్థ ఐసిస్ మరో దారుణానికి ఒడిగట్టింది. ముస్లిం మత ఆచారాలను ఇరాక్ ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని ఆరోపిస్తూ, ఇద్దరు సైనికాధికారులను తలలు నరికి చంపింది. ఈ దారుణ ఘటన షియాల ఆధిపత్యం ఉన్న కర్బాలా సిటీలో జరిగింది. సైన్యాధికారులు అలీ అల్ దరాజీ, అబ్బాస్ యాసిన్ హుస్సేన్ ల తలలను బహిరంగంగా నరికి, ఆ దృశ్యాలను ఆన్ లైన్ లో పోస్ట్ చేశారు ఐసిస్ ముష్కరులు. ఈ విషయాన్ని 'ఆరా న్యూస్' అనే వార్తా వెబ్ సైట్ వెల్లడించింది.
దక్షిణ ఇరాక్ లోని కర్బాలాలో ఐసిస్ పై సైనిక దాడులు కొనసాగుతున్న సమయంలో, ఈ ఇద్దరు సైనికాధికారులు ఐసిస్ కు చిక్కారు. వారిద్దరినీ అత్యంత దారుణంగా చంపేసింది ఐసిస్. 

  • Loading...

More Telugu News