: జాతీయ పార్టీల మద్దతు కూడగట్టే యోచనలో స్టాలిన్


తమిళనాడులో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దృష్టికి డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తీసుకెళ్లారు. అంతేకాకుండా, ఈ విషయాన్ని జాతీయ పార్టీలన్నింటి దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన యత్నిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలను కలవనున్నారు. తమిళ రాజకీయ సంక్షోభాన్ని వారికి వివరించనున్నారు. అనంతరం సీపీఎం నేత సీతారాం ఏచూరితో భేటీ అయ్యేందుకు ఆయన యత్నిస్తున్నారు.

రాష్ట్రపతితో భేటీ సందర్భంగా, తమ 89 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి, ఓటింగ్ నిర్వహించారని, రహస్య ఓటింగ్ కు తాము పట్టుబడితే నిరాకరించారని, అన్నాడీఎంకేకి అనుకూలంగా స్పీకర్ వ్యవహరించారని స్టాలిన్ ఫిర్యాదు చేశారు. గతంలో ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ లలో రహస్య ఓటింగ్ నిర్వహించిన సంగతిని గుర్తు చేశారు. 

  • Loading...

More Telugu News