: మరో రికార్డును సొంతం చేసుకున్న అశ్విన్


టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు సందర్భంగా స్టార్క్ వికెట్ పడగొట్టడం ద్వారా మరో రికార్డు అతని సొంతమయింది. భారత గడ్డపై ఒక సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అశ్విన్ అవతరించాడు. ఈ సీజన్ లో ఇప్పటిదాకా అతను 64 వికెట్లను పడగొట్టాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ను అశ్విన్ వెనక్కి నెట్టాడు.

ఈ జాబితాలో టాప్ ఫైవ్ లో ఎవరెవరున్నారో చూద్దాం... 
  • 2016-17 సీజన్లో రవిచంద్రన్ అశ్విన్ 64 వికెట్లు తీశాడు 
  • 1979-80 సీజన్లో కపిల్ దేవ్ 63 వికెట్లు పడగొట్టాడు 
  • 2004-05 సీజన్లో కుంబ్లే 54 మందిని ఔట్ చేశాడు 
  • 2016-17 సీజన్లో జడేజా 48 వికెట్లు తీశాడు 
  • 1976-77 సీజన్లో బిషన్ సింగ్ బేడీ 47 వికెట్లు పడగొట్టాడు

  • Loading...

More Telugu News